ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / crime

"ఉపాధ్యాయుల నిర్లక్ష్యం వల్లే నా బిడ్డ చనిపోయింది... లేకుంటే బతికేది" - ఏపీ వార్తలు

Student died in Maredumilli: ఉపాధ్యాయుల నిర్లక్ష్యం కారణంగా గిరిజన విద్యార్థిని మృతి చెందిన ఘటన తూర్పు గోదావరి జిల్లాలో జరిగింది. 10వ తరగతికి చెందిన విద్యార్థికి జ్వరం రావడంతో టీచర్లు ఆసుపత్రికి తీసుకెళ్లకుండా... ఇంటికి వెళ్లమన్నారు. ఇంటికి వెళ్లేసరికి జ్వరం తీవ్రత పెరగడంతో విద్యార్థిని చనిపోయింది.

Student died in Maredumilli
Student died in Maredumilli

By

Published : Mar 15, 2022, 8:07 PM IST

Student died in Maredumilli: ఉపాధ్యాయుల నిర్లక్ష్యం కారణంగా గిరిజన విద్యార్థిని మృతి చెందిన ఘటన తూర్పు గోదావరి జిల్లా మారేడుమిల్లిలో చోటుచేసుకుంది. చెక్కవాడ గ్రామానికి చెందిన అందాల సుమిత్ర అనే విద్యార్థిన మారేడుమిల్లి గిరిజన సంక్షేమశాఖకు చెందిన పాఠశాలలో 10వ తరగతి చదువుతోంది. ఈ నెల 4న సుమిత్రకు తీవ్ర జ్వరం రావడంతో ఇంటికి వెళ్లి వైద్యం చేయించుకోవాలని పాఠశాల టీచర్లు, వార్డెన్ సూచించారు. జ్వరంతోనే విద్యార్థిని ఇంటికి వెళ్లగా.. తల్లి బోదులూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రనికి తీసుకెళ్లింది.

జ్వరం తీవ్రత ఎక్కువగా ఉండటంతో.. ఆసుపత్రి సిబ్బంది రంపచోడవరం వెళ్లాలని రిఫర్ చేశారు. అక్కడ నుండి రాజమండ్రికి అటునుంచి కాకినాడకు తరలించి చికిత్స అందించినప్పటికి... ఆరోగ్యం క్షీణించి సుమిత్ర మరణించింది. ఉపాధ్యాయుల నిర్లక్ష్యం వల్లే తన బిడ్డ మరణించిందని సుచిత్ర తల్లి తెలిపింది. తన బిడ్డకు జ్వరం రాగానే టీచర్లు ఆసుపత్రిలో చూపిస్తే బతికేదని తెలిపింది. ఈ ఘటనపై పోలీసులు, రెవెన్యూ శాఖలు విడివిడిగా విచారణ చేపట్టారు. ఘటనపై మారేడుమిల్లి సర్పంచ్ జాకబ్ విచారణ వ్యక్తం చేశారు. ఘటనకు బాధ్యులైన ప్రధానోపాధ్యాయురాలు, వార్డెన్​లను సస్పెండ్ చేయాలని.. గిరిజన విద్యార్థిని కుటుంబాన్ని ఆదుకోవాలని పలువురు రాజకీయ నాయకులు, విద్యార్థులు కోరుతున్నారు.

ఇదీ చదవండి:Suicide: సినిమా బాగోలేదని 'డై' హార్డ్ ఫ్యాన్ ఆత్మహత్య!

ABOUT THE AUTHOR

...view details