ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / crime

స్పెషల్ డ్రైవ్ : 90 ఎంఎల్ విస్కీ​ టెట్రా ప్యాక్​లు స్వాధీనం - 90 ml whiskey tetra packs seized

కర్ణాటక నుంచి అనంతపురం జిల్లాలోని ఉరవకొండ పరిధిలోకి వచ్చిన ఓ వ్యక్తి ప్రత్యేక తనిఖీల్లో పట్టుబట్టాడు. సోదాల్లో నిందితుడి వద్ద నుంచి భారీగా టెట్రా ప్యాక్ విస్కీ ప్యాకెట్లను స్పెషల్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

స్పెషల్ డ్రైవ్ : 90 ఎంఎల్ విస్కీ​ టెట్రా ప్యాక్​లు స్వాధీనం
స్పెషల్ డ్రైవ్ : 90 ఎంఎల్ విస్కీ​ టెట్రా ప్యాక్​లు స్వాధీనం

By

Published : Apr 4, 2021, 6:33 AM IST

అనంతపురం జిల్లా ఉరవకొండ పరిధిలో స్పెషల్ ఎన్​ఫోర్స్​ మెంట్ బ్యూరో ఆధ్వర్యంలో లిక్కర్ చెక్ పోస్ట్ వద్ద వాహనాల తనిఖీ నిర్వహించారు. అదనపు సూపరిండెంట్ రామ్మోహన్ రావు ఆదేశాల మేరకు ఉరవకొండ స్టేషన్ పరిధిలో ప్రత్యేక డ్రైవ్ చేపట్టారు. తనిఖీల్లో కర్ణాటక నుంచి వచ్చిన ఓ వ్యక్తి ద్విచక్ర వాహనంపై 288 హైవార్డ్ చీర్స్ విస్కీ, 90 ఎంఎల్​ టెట్రా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. టెట్రా ప్యాక్​ విస్కీలు ఎక్కువ కాలం పాటు పాడవకుండా మద్యం ప్యాకెట్లలో నిల్వ ఉంటుంది.

రిమాండ్ నిమిత్తం తరలింపు..

కర్ణాటకలో సరుకు విలువ సుమారు రూ.15 వేల ఉండొచ్చని... ఏపీ రేటు ప్రకారం 30 వేలపైనే ఉంటుందని స్పెషల్ పోలీసులు పేర్కొన్నారు. నిందితుడ్ని రిమాండ్ నిమిత్తం ఉరవకొండ మేజిస్ట్రేట్ ఎదుట ఆదివారం హాజరుపరుస్తామని స్పష్టం చేశారు.

ఇవీ చూడండి : పరిషత్‌ ఎన్నికలపై నేడు హైకోర్టులో విచారణ

ABOUT THE AUTHOR

...view details