తెలంగాణ రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో దారుణం జరిగింది. తాగేందుకు డబ్బులు ఇవ్వలేదన్న కారణంతో రోకలిబండతో బాది తండ్రినే హత్య చేశాడు ఆ తనయుడు. జిల్లాకేంద్రంలోని హనుమాన్ బస్తీలో ఈ ఘటన జరిగింది.
సింగరేణిలో ఉద్యోగం చేస్తున్న గోశిక కొమురయ్య(61) ఇటీవలే మెడికల్ పరీక్షలో అన్ఫిట్ అయ్యాడు. అతని ఉద్యోగం కుమారుడికి ఇవ్వకుండా యాజమాన్యం అందించిన పరిహారం తీసుకున్నాడు. ఈ విషయంలో మనస్తాపానికి గురైన కొమురయ్య కుమారుడు శివకుమార్... తండ్రిపై కోపం పెంచుకున్నాడు.