Father killed son:మమకారం పంచిన ఆ చేతులే మద్యం మత్తులో విచక్షణ మరిచి కన్నబిడ్డను కడతేర్చాయి. ప్రకాశం జిల్లా కనిగిరి నగర పంచాయతీలోని ఇందిరాకాలనీలో ఈ ఘటన జరిగింది. రాచూరి హుస్సేన్, ఆయన కుటుంబ సభ్యులు రోజువారి కూలి పనులు చేసుకొంటూ ఇందిరా కాలనీలో నివాసం ఉంటున్నారు. హుస్సేన్‌కి వీరాంజనేయులు(24)అనే ఒక్కగానొక్క కుమారుడు. ఇటీవలే ఆ కుమారునికి వివాహం కూడా చేశారు. తండ్రి కొడుకు తరచూ మద్యం సేవించి గొడవ పడేవారు. దీంతో వీరాంజనేయులు వివాహం జరిగినప్పటి నుండి వీరాంజనేయులు భార్య పుట్టింట్లోనే ఉంటుంది.
Murder: దారుణం... కొడుకు గొంతు కోసి చంపిన తండ్రి... ఎందుకో తెలుసా? - prakasam district news
Father killed son:వ్యసనాలకు దూరంగా ఉండాలని బిడ్డకు చెప్పాల్సిన తండ్రే.. తాగి వచ్చి కుమారుడితో తగువు పెట్టుకున్నాడు. విచక్షణ మరిచి రోకలిబండతో బాదాడు. అంతేకాకండా కత్తితో పొడిచి అతి కిరాతకంగా చంపాడు. ఈ ఘటన ప్రకాశం జిల్లా కనిగిరిలో చోటుచేసుకుంది.
Father killed son
శుక్రవారం రాత్రి హుస్సేన్ పూటుగా మద్యం సేవించి వీరాంజనేయులుతో తగువు పెట్టుకున్నాడు. విచక్షణ మరిచి రోకలిబండతో బాదాడు. అంతేకాకండా కత్తితో పొడిచి అతి కిరాతకంగా చంపాడు. అనంతరం పోలీసుల ఎదుట లొంగిపోయాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు సీఐ పాపారావు తెలిపారు
ఇదీ చదవండి:ప్రేమించిన యువతి నిరాకరించిందని.. కానిస్టేబుల్ ఆత్మహత్య