MURDER: అనాలోచితంగా తీసుకున్న నిర్ణయాలు మనిషి జీవన ప్రమాణాలను దెబ్బతీస్తాయి. చిన్న చిన్న విబేధాల కారణంగా కోపోద్రిక్తులై తనువులు చాలించడమో లేక ఇతరులను చంపడమో చేస్తున్నారు. తాజాగా మానసిక స్థితి బాగాలేని కొడుకు తల్లితో గొడవపడ్డాడు. ఆ సమయంలోనే విచక్షణ కోల్పోయి దాడి చేశాడు. ఈ ఘటన ఎన్టీఆర్ జిల్లాలో జరిగింది.
ఎన్టీఆర్ జిల్లాలో దారుణం.. తల్లిని చంపిన కొడుకు - ఆంధ్రప్రదేశ్ నేర వార్తలు
MURDER: సమాజంలో రోజురోజుకి మానవ సంబంధాలకు విలువలేకుండా పోతోంది. తల్లి మందలించిందని, తండ్రి కొట్టాడని కోపం పెంచుకుని వారిని హతమారుస్తున్నారు. పున్నామా నరకం నుంచి రక్షించాల్సిన కొడుకే విచక్షణారహితంగా దాడి చేసి చంపుతున్నారు. తాజాగా మానసిక స్థితి సరిగాలేని ఓ కుమారుడు తల్లిని అత్యంత కిరాతకంగా హత్య చేసిన ఘటన ఎన్టీఆర్ జిల్లాలో జరిగింది.
murder
తిరువూరు మండలం ఎరుకుపాడుకు చెందిన చింతల నాగేంద్రబాబుకు మతిస్తిమితం సరిగా లేదు. తల్లి మంగమ్మతో గొడవపడిన అతను.. పారతో కొట్టి, గొంతు నులిమి హతమార్చాడని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తిరూవురు ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు.
ఇవీ చదవండి: