కడప జిల్లా ఓబులవారిపల్లి మండలంలో దారుణం చోటు చేసుకుంది. బంగారు ఆభరణాల కోసం తల్లిని కుమారుడు హతమార్చాడు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని శివశంకరాపురం గ్రామానికి చెందిన రామయ్య, నరసమ్మ(47) దంపతులకు కుమార్తె, కుమారుడు ఉన్నాడు. కుమారుడు నాగరాజు మద్యానికి బానిసై నిత్యం కుటుంబసభ్యులతో గొడవపడేవాడు. దీంతో అతడి భార్య పుట్టింటికి వెళ్లిపోయింది.
బంగారు ఆభరణాల కోసం.. కుమారుడు ఎంత పని చేశాడంటే.. - kill
Murder: కడప జిల్లా ఓబులవారిపల్లె మండలం శివశంకరాపురంలో దారుణం జరిగింది. సొంత తల్లిని ఓ కొడుకు హతమార్చాడు. తల్లి అలిశెట్టి నరసమ్మ(47) వద్ద డబ్బు, బంగారం తీసుకుని కుమారుడు నాగరాజు రోకలిబండతో కొట్టి తల్లిని చంపాడు.
![బంగారు ఆభరణాల కోసం.. కుమారుడు ఎంత పని చేశాడంటే.. son killed mother](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-14055916-692-14055916-1640920009312.jpg)
son killed mother
ఈ క్రమంలో భార్యను తిరిగి ఇంటికి రమ్మని కోరగా.. తాకట్టు పెట్టిన తన బంగారు నగలను విడిపించుకొస్తే కాపురానికి వస్తానని తేల్చిచెప్పింది. ఆ బంగారాన్ని విడిపించేందుకు నాగరాజు తన తల్లి బంగారాన్ని అడిగాడు. దానికి ఆమె నిరాకరించడంతో కోపోద్రిక్తుడైన నాగరాజు రోకలిబండతో నరసమ్మ తలపై బాది హతమార్చాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘంటనాస్థలికి చేరుకొని పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చదవండి:
Meeting on PRC: ఉద్యోగ సంఘాలతో చర్చలు.. పీఆర్సీపై వీడని ఉత్కంఠ
Last Updated : Dec 31, 2021, 12:36 PM IST