SON ATTACK ON PARENTS : వృద్ధ్యాప సమయంలో కడుపులో ఉంచి దాచుకోవాల్సిన కొడుకు విచక్షణ కోల్పోయి.. ఆ తల్లిదండ్రులపై దాడి చేశాడు. చిన్నప్పటి నుంచి అల్లారుముద్దుగా పెంచిన వారిని రక్తపుముద్దలుగా మార్చాడు. ఈ దారుణ ఘటన అనంతపురంలో చోటు చేసుకుంది. గుత్తి పట్టణంలోని ముల్లా మైదానం కాలనీలో కుటుంబ సమస్యల కారణంగా తల్లిదండ్రులపై కొడుకు, కోడలు దాడి చేశారు. వృద్ధ దంపతులను రోకలి బండతో విచక్షణారహితంగా కొట్టారు. దాడిలో తీవ్ర గాయాల పాలైన నారాయణస్వామి, శోభారాణిలను చికిత్స కోసం అనంతపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
గుత్తిలో దారుణం..రోకలిబండతో తల్లిదండ్రులపై దాడి - ap crime updates
SON ATTACK ON PARENTS IN ANANTAPUR: నవమాసాలు మోసి.. జీవితాన్ని నిలబెట్టిన ఆ తల్లిదండ్రులపై కొడుకు విషం చిమ్మాడు. కూర్చోని పరిష్కరించుకొనే సమస్యలను విచక్షణ మరచి దారుణానికి ఒడిగట్టాడు. కుటుంబ సమస్యల కారణంగా రోకలిబండతో దాడి చేశాడు.
SON ATTACK ON PARENTS
Last Updated : Dec 24, 2022, 3:48 PM IST