SON ATTACK ON MOTHER NECK : ఏ పేగు తెంచుకుని పుట్టాడో అదే పేగుపై తంతూ.. మెడపై కాలు వేసి తొక్కుతూ.. తన తల్లితో అంత్యంత కిరాతంగా ప్రవర్తించాడు ఓ కొడుకు. ఈ దారుణ ఘటన.. కాకినాడ జిల్లా కాజులూరులో జరిగింది. పింఛన్ డబ్పులు ఇవ్వాలని తల్లిబోయిన వెంకన్న మద్యం మత్తులో 70 ఏళ్ల వృద్ధురాలైన కన్నతల్లిని కిందపడేసి కాళ్లతో పలుమార్లు తన్నాడు. ఆమెతో మానవ మృగంలా ప్రవర్తిస్తూ..చిత్ర హింసలకు గురిచేశాడు. తీవ్రంగా గాయపడ్డ తల్లిని.. స్థానికులు యానాం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమంలో వైరల్ కావడంతో.. కాకినాడ ఎస్పీ రవీంద్రనాథ్ బాబు స్పందించారు. వెంకన్నపై కేసు నమోదు చేశారు. వృద్ధ తల్లిదండ్రులపై దాడులకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు.
పింఛన్ డబ్బుల కోసం తల్లిపై క్రూరంగా దాడి.. వీడియో వైరల్ - kakinada latest news
Son Attack On Mother : నవమాసాలు మోసి కనిపెంచిన ఆ తల్లిపై కొడుకు విచక్షణారహితంగా దాడి చేశాడు. మద్యం మత్తులో మానవత్వాన్ని మరచి క్రూరంగా ప్రవర్తించాడు. పింఛన్ డబ్బులు ఇవ్వలేదని ఆ తల్లి కంఠం మీద కాలుతో తొక్కుతూ వేధించాడు. ఈ హృదయ విదారక ఘటన కాకినాడ జిల్లాలో జరిగింది.
![పింఛన్ డబ్బుల కోసం తల్లిపై క్రూరంగా దాడి.. వీడియో వైరల్ Son Attack On Mother](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-16484885-979-16484885-1664262285225.jpg)
Son Attack On Mother
పింఛన్ డబ్బులు కోసం తల్లిపై క్రూరంగా దాడి.. వీడియో వైరల్
Last Updated : Sep 27, 2022, 1:01 PM IST