ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / crime

ఎవరైనా మీ ఫొటో తీస్తున్నారా.. ఐతే చిక్కుల్లో పడ్డట్టే! - Hyderabad news

బహిరంగ ప్రదేశాలు, బస్టాండ్లు, మార్కెట్‌, పర్యాటక ప్రాంతాల్లో నిల్చునప్పుడో, లేక రెస్టారెంట్‌, షాపింగ్‌ మాల్స్​కు వెళ్లినప్పుడు, కార్యాలయంలో విధుల్లో ఉన్నప్పుడు అనుమతి లేకుండా మీ ఫొటోలు, వీడియోలు ఎవరైనా తీస్తున్నారా? అమ్మాయిలూ.. అయితే మీరు జాగ్రత్త పడాల్సిందే.. లేదంటే చిక్కుల్లో పడ్డట్టే..!

posting pictures of women on social media
posting pictures of women on social media

By

Published : Jan 4, 2023, 5:35 PM IST

హిరంగ ప్రదేశాలు, బస్టాండ్లు, మార్కెట్‌, పర్యాటక ప్రాంతాల్లో నిల్చునప్పుడో, లేక రెస్టారెంట్‌, షాపింగ్‌ మాళ్లకు వెళ్లినప్పుడు, కార్యాలయంలో విధుల్లో ఉన్నప్పుడు అనుమతి లేకుండా మీ ఫొటోలు, వీడియోలు ఎవరైనా తీస్తున్నారా? మహిళలూ పారాహుషార్‌! కొన్నిరోజుల తర్వాత అవి అశ్లీల వెబ్‌సైట్లు, యూట్యూబ్‌, సామాజిక మాధ్యమాల్లో ప్రత్యక్షమవ్వొచ్చు. ఇటీవల నగరంలో వెలుగుచూస్తున్న ఉదంతాలే ఇందుకు నిదర్శనం. రహస్యంగా ఫొటోలు, వీడియోలు చిత్రీకరిస్తున్న గుర్తు తెలియని వ్యక్తులు.. వాటికి అసభ్య కామెంట్లు జోడించి యూట్యూబ్‌ ఛానెళ్లలో అప్‌లోడ్‌ చేస్తున్నారు. తెలిసిన వ్యక్తులూ ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నట్లు పోలీసులు స్పష్టం చేస్తున్నారు.

  • హైదరాబాద్​ నగరానికి చెందిన మహిళ తన ఫొటోలను ఇప్పటివరకూ ఎవరితోనూ పంచుకోలేదు. సామాజిక మాధ్యమాల్లో ఖాతాలు లేవు. అయినా ఆమె ఫొటో సామాజిక మాధ్యమాల్లో.. అశ్లీల వెబ్‌సైట్లలో ప్రత్యక్షమైంది. ఆమె చిత్రానికి అసభ్య కామెంట్లు జోడించిన గుర్తు తెలియని వ్యక్తి సామాజిక మాధ్యమంలో పోస్టు చేశాడు. తెలిసిన వ్యక్తుల ద్వారా విషయం తన దృష్టికి రావడంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది.
  • ఇన్‌స్టాగ్రామ్‌లో ఖాతా ఉన్న యువతి తరచూ తన ఫొటోలు, రీల్స్‌ పోస్టు చేస్తుండేది. ఈ ఫొటోలను గుర్తు తెలియని వ్యక్తి అశ్లీల దృశ్యాలుగా మార్చి అసభ్య వ్యాఖ్యలతో యూట్యూబ్‌ ఛానెల్‌లో పోస్టు చేశాడు. తీవ్ర మనోవేదనకు గురైన బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ఆదాయం కోసం అడ్డదారి:కొందరు ఆదాయం కోసం ఇలాంటి అడ్డదారులు తొక్కుతున్నట్లు సైబర్‌క్రైమ్‌ పోలీసులు తెలిపారు. తమ పేజీ, ఛానెల్‌కు వ్యూస్‌ రావడం కోసం మహిళలు, యువతుల ఫొటోలు పోస్టు చేస్తున్నారు. కాల్‌ గర్ల్‌ కావాలంటే సంప్రదించాలంటూ కొన్ని ఫోన్‌ నంబర్లు ఉంచుతున్నారు. ఐటీ ఉద్యోగం కోల్పోయిన రాజమహేంద్రవరానికి చెందిన ఓ యువకుడు యూట్యూబ్‌ ఛానెళ్లు, ఒక వెబ్‌సైట్‌ నిర్వహిస్తున్నాడు. గూగుల్‌, సామాజిక మాధ్యమాల నుంచి మహిళలు, యువతుల ఫొటోలు సేకరించి.. అసభ్యమైన కామెంట్లు జోడించి యూట్యూబ్‌లో పోస్టు చేస్తున్నాడు. బాధితుల ఫిర్యాదుతో అక్టోబరులో సైబరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు నిందితుడు చెన్నైలో ఉన్నట్లు గుర్తించి అరెస్టు చేశారు.

మహిళ స్నానం చేస్తుండగా వీడియో: మహిళ స్నానం చేస్తుండగా వీడియో చిత్రీకరించిన యువకుడిపై జూబ్లీహిల్స్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యూసుఫ్‌గూడ ప్రాంతంలో నివసించే ఓ మహిళ డిసెంబరు 31వ తేదీ ఉదయం స్నానం చేస్తుండగా, భవనం పైఅంతస్తులో నివసించే అఖిల్‌ అనే యువకుడు తన చరవాణిలో బాత్‌రూం కిటికీలోంచి వీడియో తీస్తుండటాన్ని గమనించింది. అప్రమత్తమైన ఆమె వెంటనే ఇంట్లోకి వెళ్లిపోయింది. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయగా, నిందితుడిపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకొన్నారు.

అశ్లీల వీడియోలతో విపరీత మార్పు:

"అశ్లీల వీడియోలు ఎక్కువగా చూసేవారిలో మానసికంగా విపరీతమైన మార్పులు వస్తాయి. బాగా ప్రభావితమై ఏం చేస్తున్నారో అర్థం కాని స్థితిలోకి వెళ్తారు. తమకు కనిపించే మహిళలతో శృంగారంలో పాల్గొనాలని భావిస్తుంటారు. ఇది సాధ్యం కానప్పుడు వారి ఫొటోలు, వీడియోలను అనుమతి లేకుండా సేకరిస్తారు. వాటిని అశ్లీలంగా మార్చి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేస్తుంటారు." -డాక్టర్ మోతుకూరి రాంచందర్‌, కౌన్సెలింగ్‌ సైకాలజిస్టు

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details