ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / crime

రూ.లక్ష విలువైన గుట్కా పట్టివేత.. నిందితుడి అరెస్ట్​ - ప్రభుత్వ నిషేధిత గుట్కా పట్టివేత

నిషేధిత గుట్కాను అక్రమంగా తరలిస్తోన్న ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్​ చేశారు. భారీ గుట్కాతో పాటు కారును స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన తెలంగాణలోని వరంగల్​ రూరల్​ జిల్లా పరకాల సమీపంలో జరిగింది.

selling gutka is a crime
రూ.లక్ష విలువైన గుట్కా పట్టివేత.

By

Published : Mar 8, 2021, 2:46 AM IST

గుట్టు చప్పుడు కాకుండా గుట్కా ప్యాకెట్లను తరలిస్తోన్న ఓ వ్యక్తిని వరంగల్​ రూరల్​ జిల్లా పరకాల పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుని నుంచి రూ.1 లక్షా 12 వేల విలువైన గుట్కా ప్యాకెట్లు, కారుని స్వాధీనం చేసుకున్నారు.

నిందితుడు మల్లేశం.. గుట్కాను పరకాలకు చెందిన ఆకుల రాజు వద్ద తక్కువ ధరకు కొని.. చుట్టుపక్కల గ్రామాల్లో ఎక్కువ ధరకు విక్రయించేవాడని ఎస్సై మహేందర్ రెడ్డి తెలిపారు. నిషేధిత గుట్కాలు అమ్మే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details