Six Arrested For Selling Ganjai In Nellore : గంజాయి విక్రయిస్తున్న ఆరుగురిని నెల్లూరు సెబ్ అధికారులు అరెస్టు చేశారు. నగరంలోని వెంగళరావునగర్ చెందిన సలీం అనే వ్యక్తి నివాసంపై దాడులు నిర్వహించిన అధికారులు.. ఆరు కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. సలీం అతని కుమారుడు సల్మాన్ను అరెస్ట్ చేసి.. వారిచ్చిన సమాచారంతో వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో రెండు కార్లలో 20 కేజీల గంజాయి పట్టుకుని.. తసీమ్, వెంకటేశ్వర్లను అదుపులోకి తీస్తున్నారు. వీరిద్దరూ పలమనేరుకు చెందిన మురుగన్, శివలకు గంజాయి విక్రయిస్తున్నట్లు తెలుసుకుని వారిని అరెస్ట్ చేశారు.
నెల్లూరులో గంజాయి అమ్మకాలు.. ఆరుగురు అరెస్ట్ - ap latest news
Six Arrested For Selling Ganjai In Nellore : గంజాయి అమ్మకాల సాగిస్తున్న ఆరుగురిని నెల్లూరు సెబ్ అధికారులు అరెస్టు చేశారు. విశాఖ ఏజెన్సీలో కేజీ 10వేల రూపాయలకు గంజాయి కొనుగోలు చేసి రూ.15 వేలకు విక్రయిస్తున్నట్లు జిల్లా ఎస్పీ విజయరావు తెలిపారు.
గంజాయి
తసీన్, వెంకటేశ్వర్లు విశాఖ ఏజెన్సీలో కేజీ 10వేల రూపాయలకు గంజాయి కొనుగోలు చేసి.. 15 వేలకు విక్రయిస్తున్నట్లు జిల్లా ఎస్పీ విజయరావు తెలిపారు. ఈ కేసులో మరి కొందరిని అరెస్ట్ చేయాల్సి ఉందని.. చైన్ లింక్లా సాగుతున్న గంజాయి అమ్మకాలను అరికట్టిన సెబ్ అధికారులను ఎస్పీ అభినందించారు.
ఇవీ చదవండి