దేశవ్యాప్తంగా సంచలనం రేపిన దిశ ఘటనలో నిందితులను పోలీసులు ఎన్కౌంటర్ చేసిన విషయం విధితమే. అయితే తమ వాళ్లు పారిపోయేందుకు ప్రయత్నించలేదని... పోలీసులే కావాలని ఎన్కౌంటర్ చేసినట్లు మృతుల కుటుంబసభ్యులు కోర్టును ఆశ్రయించారు. దీనిలో భాగంగా సిర్పూర్కర్ కమిషన్ (Sirpurkar Commission) విచారణను వేగవంతం చేసింది.
కమిషన్ ముందుకు మృతుడు చెన్నకేశవులు భార్య మంగళవారం హాజరయ్యారు. చెన్నకేశవులు సరిగా నడవలేడని... అలాంటి వ్యక్తి పోలీసులనుంచి తప్పించుకుని ఎలా పారిపోగలడని... వాంగ్మూలం ఇచ్చింది. తనకు తగిన న్యాయం చేయాలని కమిషన్ను కోరింది. దిశ ఎన్కౌంటర్లో మృతి చెందిన చెన్నకేశవులు భార్య రేణుకతో పాటు... చెన్నకేశవులు చదివిన పాఠశాల ప్రధానోపాధ్యాయుడిని కమిషన్ ప్రశ్నించింది.