తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి వద్ద జాతీయ రహదారిపై ఆదివారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదం(Road accident on National Highway at Gandepalli )లో ఒక పోలీస్ అధికారి భార్య ప్రాణాలు కోల్పోయింది. మిగిలిన కుటుంబ సభ్యులకు స్వల్ప గాయాలయ్యాయి. విజయవాడ ఎస్ఆర్ పేట స్టేషన్లో ఎస్సై గా పనిచేస్తున్న సత్యనారాయణ.. తన కుటుంబలతో కలిసి కారులో అన్నవరం దైవ దర్శనానికి బయలుదేరారు.
ACCIDENT: దైవ దర్శనానికి వెళ్తుండగా ప్రమాదం.. ఎస్సై భార్య దుర్మరణం - ఎస్సై భార్య దుర్మరణం
అన్నవరం దైవ దర్శనానికి వెళ్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ పోలీస్ అధికారి భార్య మృతిచెందారు. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి వద్ద జాతీయ రహదారిపై జరిగింది.
విజయవాడ నుంచి వెళ్తుండగా.. జాతీయ రహదారిపై గండేపల్లి గ్రామ శివారు(Road accident at Gandepalli)లో వర్షం కురుస్తోంది. అదే సమయంలో వారి వాహనానికి కుక్క అడ్డురావడంతో అదుపుతప్పి సమీపంలోని పంట పొలాల్లో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఎస్సై భార్య సరోజ మృతి చెందారు. ఇతర కుటుంబ సభ్యులు స్వల్ప గాయాలతో బయపడ్డారు. వాళ్లను సమీపం ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనా స్థాలానికి చేరుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి..SZC meeting: దక్షిణాది ప్రాంతీయ మండలి సమావేశం ప్రారంభం