ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jul 28, 2021, 12:06 PM IST

ETV Bharat / crime

ఆ రాష్ట్రంలో... మహిళలను వేధిస్తున్నవారిలో.. యువకులే అధికం!

మహిళలను వేధిస్తున్న వారిలో యువకులే ఎక్కువగా ఉన్నట్లు షీ టీంల పనితీరుకు సంబంధించి నివేదికలో ఈ విషయాన్ని వెల్లడించింది. ఎక్కువ మంది మహిళలు ఫోన్‌లలో వేధింపులకు గురవుతున్నట్లు నివేదికలో తేలింది.

she teams
she teams

మహిళలను వేధిస్తున్న వారిలో 19-24 ఏళ్ల మధ్య యువకులు ఎక్కువగా ఉంటున్నట్లు తెలంగాణ మహిళా భద్రతా విభాగం వెల్లడించింది. ఎక్కువ మంది మహిళలు ఫోన్‌లలో వేధింపులకు గురవుతున్నట్లు తెలిపింది. తెలంగాణ రాష్ట్రంలో షీ టీంల పనితీరుకు సంబంధించి మంగళవారం విడుదల చేసిన నివేదికలో ఈ విషయాల్ని వెల్లడించింది. ఈ ఏడాది జనవరి నుంచి జూన్‌ నెలాఖరు వరకూ 6 నెలల్లో షీ టీంలకు 2,803 ఫిర్యాదులు అందగా.. 1251 మంది నిందితులను గుర్తించినట్లు తెలిపింది.

వీటికి సంబంధించి 271 ఎఫ్‌ఐఆర్‌లు, 325 పెట్టీ కేసులు నమోదు చేశారు. 171 ఫిర్యాదులు పెండింగ్‌లో ఉన్నాయి. 1048 ఫిర్యాదులను మూసివేశారు. 363 మంది నిందితులకు కౌన్సెలింగ్‌ ఇచ్చి, 625 మందిని హెచ్చరించి వదిలేశారు. 114 ఘటనల్లో వేధింపులకు పాల్పడుతున్న నిందితులను ‘షీ’ బృందాలు స్వయంగా పట్టుకున్నాయి.

ABOUT THE AUTHOR

...view details