SEXUAL ATTACK: ఇద్దరు బాలికలపై..ఆ తండ్రీకొడుకులిద్దరూ.. - vishakapatnam crime news
18:35 September 14
అచ్యుతాపురం మండలంలో దారుణం
పిల్లలు తప్పు చేస్తే సరిదిద్దాల్సిన తండ్రే..ఇద్దరు బాలికలపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. తండ్రే వక్రమార్గంలో పయనిస్తుంటే కుమారుడు ఊరుకుంటాడా.. అతను కూడా సమయం కోసం ఎదురుచూశాడు. ఆడిపిస్తానంటూ పిల్లలను దగ్గరకు తీసుకుని ఈ ఘాతుకానికి పాల్పడిన ఘటన విశాఖ జిల్లా అచ్యుతాపురం మండలంలో జరిగింది.
ఇద్దరు బాలికలపై తండ్రీకుమారులిద్దరూ లైంగిక దాడికి పాల్పడ్డారు. ఆటలు నేర్పిస్తామంటూ అఘాయిత్యానికి పాల్పడినట్లు.. బాధిత కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. బాధిత బాలికలను అనకాపల్లి ఆస్పత్రికి తరలించారు. ఘటనాస్ధలిని పోలీసులు, రెవెన్యూ, మహిళాశిశు సంక్షేమ అధికారుల బృందం పరిశీలించింది. నిందితులపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు.. వారిని ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది.