ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / crime

Minor love: వయసు 17 ఏళ్లు.. ముగ్గురితో ప్రే‘మాయ’ణం! - seventeen year boy cheated 3 girls

ప్రేమంటే ఏంటో తెలియని వయసు.. కానీ ముగ్గురిని ప్రేమించాడు. పెళ్లంటే ఏంటో తెలీదు.. కానీ ముగ్గురినీ పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. పదిహేడేళ్లకే వారికి ప్రేమపాఠాలు నేర్పించి శారీరకంగా లొంగదీసుకున్నాడు. చివరకు వంచించాడు. తెలంగాణ మహబూబాబాద్ జిల్లాలో ఈ బాలుడి నిర్వాకం బయటపడింది.

seventeen-year-boy
seventeen-year-boy

By

Published : Aug 5, 2021, 9:48 AM IST

ఒకరికి తెలియకుండా మరొకరితో ప్రేమ, పెళ్లి పేరుతో సంబంధాలు పెట్టుకుని ఓ బాలుడు(17) ఏకంగా ముగ్గురు బాలికలను మోసం చేసిన ఘటన తెలంగాణ మహబూబాబాద్‌ జిల్లా గార్ల మండలంలో బుధవారం వెలుగు చూసింది. మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలుడు మొదట పక్క గ్రామానికి చెందిన బాలిక(16)ను ప్రేమ పేరుతో వంచించి శారీరక సంబంధం పెట్టుకున్నాడు. ఇది ఆమె తల్లిదండ్రులకు తెలియడంతో కొంత డబ్బు చెల్లించి తెగతెంపులు చేసుకున్నాడు.

తరువాత మరో బాలిక(14)తో శారీరక సంబంధం పెట్టుకుని, ఇంకో బాలిక(17)ను పెళ్లి చేసుకుంటానంటూ దగ్గరయ్యాడు. అనుమానంతో మూడో బాలిక బాలుడి ఇంటికే రావడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై బాలుడు, మూడో బాలిక కుటుంబసభ్యులు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో పరస్పరం ఫిర్యాదు చేసుకున్నారు. దీనిపై విచారణ చేస్తున్నామని ఎస్సై రవి తెలిపారు.

ఇదీ చదవండి: విరిగిన పులిచింతల ప్రాజెక్టు గేటు.. లక్ష క్యూసెక్కుల నీరు వృథా

ABOUT THE AUTHOR

...view details