ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / crime

డివైడర్ను ఢీ కొన్న కారు.. ముగ్గురు మృతి.. మరో ఇద్దరు చిన్నారుకు తీవ్రగాయాలు - Fatal road accident on Bangalore road

Road Accident: శ్రీ సత్య సాయి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బెంగళూరు నుంచి హైదరాబాద్ వెళుతున్న మార్గంలో కారు డివైడర్​ని డీకొనడం వల్ల ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.

Serious road accident in Sri Sathya Sai district
శ్రీ సత్య సాయి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

By

Published : Nov 19, 2022, 10:50 AM IST

Road Accident Sri Sathyasai district:) శ్రీ సత్య సాయి జిల్లా కనగానపల్లి మండలం పర్వత దేవరపల్లి వద్ద జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. తెలంగాణ రాష్ట్రం వరంగల్‌కు చెందిన సాఫ్ట్‌వేర్‌ దంపతులు రమ్య గోపీనాథ్‌లు...తమ పిల్లలు సాహిత్, హాసినితో పాటు బంధువుతో కలిసి బెంగళూరు నుంచి కారులో హైదరాబాద్ వస్తున్నారు. కారు వేగంగా డివైడర్‌ను ఢీకొనడంతో....దంపతులిద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. వారి బంధువు తారకేశ్వరి అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. ప్రమాదంలో గాయపడిన పిల్లలు సాహిత్ , హాసినికి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు

ABOUT THE AUTHOR

...view details