ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / crime

స్నేహితుడిని కత్తితో పొడిచి.. రక్తం కారుతుండగానే సెల్ఫీ - హైదరాబాద్ తాజా నేర వార్తలు

తన గర్ల్‌ఫ్రెండ్‌కి హాయ్ చెప్పాడనే అక్కసుతో పదో తరగతి విద్యార్థి.. మరో విద్యార్థిపై కత్తితో దాడి చేసిన ఘటనలో.. కొత్త విషయం వెలుగు చూసింది. కత్తితో పొడిచిన తర్వాత.. బాధితుడి ఒంట్లోంచి రక్తం కారుతుండగా.. సెల్ఫీ దిగినట్లు పోలీసులు తెలిపారు.

selfie
selfie

By

Published : May 18, 2022, 4:03 PM IST

తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్​లో.. ఇద్దరు బాలుర మధ్య చిచ్చురేపిన ప్రేమ వ్యవహారం.. కత్తిపోట్లకు దారితీసిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. బాధితుడు దుర్గాప్రసాద్​పై తన స్నేహితుడితో కలిసి కత్తితో దాడిచేసి నిందితుడు.. రక్తం కారుతుండగానే సెల్ఫీ దిగినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై హైదరాబాద్​లోని రాజేంద్రనగర్‌ పీఎస్‌లో జీరో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసిన పోలీసులు.. అనంతరం బంజారాహిల్స్‌ పీఎస్‌కు బదిలీ చేశారు. విచారణ చేపట్టిన పోలీసులు.. దాడి చేసిన ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

అసలేెం జరిగిదంటే :తన ప్రియురాలికి దుర్గాప్రసాద్‌ హాయ్‌ చెప్పాడనే అక్కసుతో నిందితుడు పథకం ప్రకారం దాడి చేశాడు. తన స్నేహితుడితో కలిసి హైదరాబాద్ లోని ఫిలింనగర్‌లో ముందుగా పార్టీ చేసుకున్నాడు. ఆ తర్వాత ఇద్దరు నిందితులు.. దుర్గాప్రసాద్​కు మాయమాటలు చెప్పి, అతణ్ని అత్తాపూర్‌లోని మూసీ వద్దకు తీసుకెళ్లారు. అక్కడ ఒక్కసారిగా కత్తులతో దాడి చేశారు. ఈ ఘటనలో ప్రసాద్‌కు తీవ్రగాయాలయ్యాయి. బాధితుడు కేకలు వేయడంతో.. నిందితులు అక్కడి నుంచి పారిపోయారు.

ఇదీ చదవండి :

ABOUT THE AUTHOR

...view details