హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఓ ప్రయాణికుడి నుంచి 528 గ్రాముల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం(Gold seized) చేసుకున్నారు. దోహా నుంచి హైదరాబాద్ వచ్చిన ఓ ప్రయాణికుడిపై అనుమానంతో లగేజీ తనిఖీలు చేయగా.. ఫేస్ క్రీమ్ డబ్బాల్లో బంగారం తీసుకొచ్చినట్లు గుర్తించారు.
Gold seized: ఎయిర్‌పోర్టులో బంగారం పట్టివేత... ఫేస్‌క్రీమ్ డబ్బాల్లో.. - తెలంగాణ వార్తలు
బంగారం అక్రమ రవాణా అడ్డుకునేందుకు అధికారులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఆగడం లేదు. శంషాబాద్ కేంద్రంగా అక్రమంగా పసిడి రవాణా వ్యవహారం మరోసారి బయటపడింది. ఫేస్‌క్రీమ్ డబ్బాల్లో బంగారం తరలిస్తుండగా కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
Gold seized
ఆ ప్రయాణికుడి నుంచి రూ.20.44లక్షలు విలువ చేసే 528 గ్రాముల బంగారం, 28 గ్రాముల వెండిని స్వాధీనం చేసుకున్నట్లు కస్టమ్స్ అధికారులు తెలిపారు. బంగారాన్ని అక్రమంగా తీసుకొచ్చిన ప్రయాణికుడిని అరెస్టు చేసినట్లు ఎయిర్‌పోర్టు డిప్యూటీ కమిషన్ బాలసుబ్రహ్మణ్యం వెల్లడించారు.
ఇదీ చదవండి: