కర్నూలు పంచలింగాల చెక్ పోస్టు వద్ద సెబ్ అధికారులు భారీగా నగదును గుర్తించారు. బీదర్‌కు చెందిన గురునాథ్ అనే వ్యక్తి.. కారులో హైదరాబాద్ నుంచి కర్నూలు వైపు వస్తుండగా అధికారులు కారును తనిఖీ చేశారు. ఈ సోదాల్లో ఎలాంటి ఆధారాలు లేకుండా తీసుకువెళ్తున్న 75 లక్షల రూపాయల నగదును గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి నగదును తాలూకా అధికారులకు అప్పగించినట్లు సెబ్ సీఐ మంజుల తెలిపారు.
CASH SEIZED: పంచలింగాల చెక్‌పోస్ట్ వద్ద భారీగా నగదు పట్టివేత..ఎంతంటే..! - ap 2021 news
హైదరాబాద్ నుంచి కర్నూలు వెళ్తున్న ఓ కారులో సెబ్ అధికారులు భారీ నగదును గుర్తించారు. ఎటువంటి ఆధారాలు లేకుండా తీసుకెళ్తున్న 75 లక్షల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు.
వాహన తనిఖీల్లో బయటపడ్డ భారీ నగదు.. రూ.75 లక్షలు స్వాధీనం