రైల్వే స్టేషన్‌లో వృద్ధుడు ఆత్మహత్య.. అదే కారణమా..! - old man died at prashanthi nilayam railway station

19:24 May 14
సత్యసాయి జిల్లాలో ఘటన
సత్యసాయి జిల్లాలో దారుణం జరిగింది. పుట్టపర్తి ప్రశాంతి నిలయం రైల్వే స్టేషన్‌లో ఓ వృద్ధుడు.. తాగు నీటి పైపులైన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు బుక్కపట్నం మండలం మారాల గ్రామానికి చెందిన నారాయణప్ప (80) గా గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
నారాయణప్ప ఆత్మహత్యకు బుక్కపట్నం వైకాపా కన్వీనర్ సుధాకర్ రెడ్డి కారణమని మృతుని బంధువులు ఆరోపిస్తున్నారు. గతంలో వైకాపా నేతపై నమోదైన అట్రాసిటీ కేసులో నారాయణప్ప.. అతనికి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పాడన్నారు. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని నారాయణప్ప పింఛన్‌ను సైతం తొలిగించారన్నారు. నాలుగు నెలలుగా కార్యాలయం చుట్టూ తిరిగినా పింఛన్ రాలేదన్నారు. నారాయణప్ప మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మృతుని బంధువులు డిమాండ్ చేశారు. నారాయణప్పకు భార్య పిల్లలు ఎవరూ లేరు.
ఇదీ చదవండి:వైకాపా నేతల మధ్య ఘర్షణ.. రివాల్వర్‌తో ఓ నాయకుడి హల్‌చల్