యువతి దారుణ హత్య.. హంతకుడెవరంటే..! - పశ్చిమ గోదావరి జిల్లా తాజా వార్తలు
16:56 April 05
మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ పరామర్శ.. న్యాయం చేస్తామని హామీ
Murder: పశ్చిమగోదావరి జిల్లా కాళ్ల మండలం పల్లిపాలెం గ్రామానికి చెందిన కల్యాణి (19)అనే యువతి దారుణ హత్యకు గురైంది. ఆమెపై ఆ గ్రామ సర్పంచ్ కుమారుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. అయితే ఆ యువతి తీవ్రంగా ప్రతిఘటించడంతో ఆమెను హత్య చేశాడు. వేరొక గదిలో నిద్రిస్తున్న ఆమె అమ్మమ్మ వచ్చి తలుపులు తీసి చూసి పెద్దగా కేకలు వేయడంతో అక్కడి నుంచి సాయిప్రసాద్ పరారయ్యాడు. గ్రామ పెద్దలు రాజీ చేసి యువతి మృతదేహానికి అంత్యక్రియలు చేసేందుకు శ్మశానానికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు శ్మశానంలో అంత్యక్రియలను అడ్డుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భీమవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ పరామర్శ: పశ్చిమ గోదావరి జిల్లాలో హత్యకు గురైన యువతి కుటుంబాన్ని మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ పద్మ పరామర్శించారు. యువతి కుటుంబసభ్యులకు న్యాయం చేస్తామని వాసిరెడ్డి పద్మ, ఎమ్మెల్యే రామరాజు హామీ ఇచ్చారు.
ఇదీ చదవండి: Entrance Examination Schedule: ఈ ఏడాది వివిధ ప్రవేశ పరీక్షల షెడ్యూల్ ఇదే..