ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / crime

KARNATAKA ALCOHOL SEIZED: రూ.10 లక్షల విలువ చేసే మద్యం పట్టివేత - alcohol seized

రూ. 10 లక్షల విలువచేసే కర్ణాటక మద్యాన్ని కర్నూలు జిల్లా గూడూరు పోలీసులు పట్టుకున్నారు. ఐదుగురు వ్యక్తుల్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. బొలేరో వాహనం, ద్విచక్రవాహంతో పాటు 4 చరవాణులను సీజ్ చేశారు.

karnataka alcohol seized
karnataka alcohol seized

By

Published : Aug 28, 2021, 7:27 PM IST

కర్నూలు జిల్లా గూడూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని సుంకేసుల చెక్​పోస్ట్ వద్ద శనివారం తెల్లవారుజామున అక్రమంగా తరలిస్తున్న రూ.10 లక్షల విలువచేసే కర్ణాటక మద్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. మొత్తం 150 బాక్సుల్లో తరలిస్తుండంగా స్వాధీనం చేసుకున్నారు. మొత్తం ఐదుగురు వ్యక్తుల్ని అదుపులోకి తీసుకున్నట్లు కోడుమూరు సీఐ శ్రీధర్ చెప్పారు. మద్యం రవాణాకు వినియోగించిన బొలేరో వాహనం, ద్విచక్రవాహంతో పాటు నాలుగు చరవాణులను సీజ్ చేశామని వివరించారు.

ఈ ఐదుగురు పై కేసు నమోదు చేసి రిమాండ్​కు పంపినట్లు సీఐ వెల్లడించారు. మద్యాన్ని పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన పోలీసులను సీఐ అభినందించారు. నిందితుడు దామోదర్ రెడ్డి స్థానిక వైకాపా సర్పంచ్​కి వరసకి మరిదని.. ఇటీవల కాలంలో గుప్తనిధుల తవ్వకాలల్లో ప్రధాన నిందితుడని తెలుస్తోంది.

ABOUT THE AUTHOR

...view details