ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / crime

అకస్మాత్తుగా మంటలు.. క్షణాల్లో ఆర్టీసీ బస్సు దగ్ధం - జడ్చర్లలో బస్సు దగ్ధం

RTC Bus Catches Fire in Jadcherla : తెలంగాణలోని మహబూబ్​నగర్ జిల్లా జడ్చర్ల సమీపంలోని 44వ నెంబర్ జాతీయ రహదారిపై ప్రమాదం జరిగింది. కర్నూల్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఆర్టీసీ బస్సులో ఉన్నట్టుండి మంటలు చెలరేగాయి.

RTC Bus Catches Fire in Jadcherla
ఆర్టీసీ బస్సు దగ్ధం

By

Published : Jun 27, 2022, 10:15 AM IST

ఆర్టీసీ బస్సు దగ్ధం

RTC Bus Catches Fire in Jadcherla : తెలంగాణలోని మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల సమీపంలోని 44వ నెంబర్ జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సు దగ్ధమైంది. కర్నూల్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న బస్సులో బ్యాటరీ వద్ద మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన డ్రైవర్ చిట్టి.. బోయిన్‌పల్లి వద్ద బస్సును నిలిపేశారు. వెంటనే ప్రయాణికులంతా వేగంగా కిందకు దిగారు. చూస్తుండగానే బస్సు పూర్తిగా కాలిపోయింది. బస్సులోని 16 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడంతో.. అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details