Road accident on Medaram Route:తెలంగాణములుగు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆర్టీసీ బస్సు, కారు ఢీకొని నలుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. కారులో భక్తులు మేడారం సమ్మక్క, సారలమ్మ దర్శనానికి వెళ్తుండగా.. ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. మేడారానికి వెళ్లే మార్గంలో గట్టమ్మ ఆలయం సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ఘటనలో కారు నుజ్జునుజ్జయింది.
TS: మేడారం జాతరకు వెళ్తుండగా ప్రమాదం.. నలుగురు మృతి - తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం

తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం
09:24 February 19
తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం
ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కారులో ఇరుక్కుపోయిన మృతదేహాలను బయటకు తీశారు. కేసు నమోదు చేసుకుని ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. కాగా..మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.
ఇదీ చదవండి
శ్రీకాకుళంలో లారీని ఢీకొట్టిన ప్రైవేట్ బస్సు.. 30 మందికి గాయాలు
Last Updated : Feb 19, 2022, 10:36 AM IST