రోడ్డు రోలర్‌తో తొక్కించి.. రూ.2 కోట్లు విలువైన మద్యం ధ్వంసం
Liquor destroyed: గత రెండేళ్ల కాలంలో పట్టుబడిన అక్రమ మద్యాన్ని.. కర్నూలు నగర శివారులో పోలీసులు ధ్వంసం చేశారు. రెండేళ్లలో కర్నూలు సెబ్ స్టేషన్ పరిధిలో.. 593 అక్రమ మద్యం తరలింపు కేసులు నమోదు అయ్యాయి. వీటిలో పట్టుబడిన 2 కోట్ల రూపాయల విలువైన 66 వేల మద్యం బాటిళ్లను పోలీసులు రోడ్డు రోలర్‌తో తొక్కించి ధ్వంసం చేసినట్లు కర్నూలు ఎస్పీ సిద్ధార్థ కౌశల్ తెలిపారు.
Rs.2 Crores liquor destroyed: అక్రమ మద్యం కేసులో జప్తు చేసిన రూ.2 కోట్ల విలువైన మద్యాన్ని సెబ్ అధికారులు శనివారం ధ్వంసం చేశారు. 2021-22 సంవత్సరానికి సంబంధించి కర్నూలు సెబ్ స్టేషన్‌లో నమోదైన 593 కేసుల్లో 66 వేల మద్యం సీసాలను అధికారులు జప్తు చేశారు. కోర్టు అనుమతితో ఎస్పీ సిద్ధార్థ కౌశల్ పర్యవేక్షణలో సెబ్ అధికారులు కర్నూలు మండల పంచలింగాల-ఇ.తాండ్రపాడు మధ్య ప్రధాన రహదారిపై శనివారం 66 వేల మద్యం సీసాలను రోడ్డు రోలర్‌తో తొక్కించి ధ్వంసం చేయించారు. అక్రమ మద్యం రవాణాపై నిఘా పెంచి కట్టడి చేయాలని సిబ్బందికి ఎస్పీ ఆదేశించారు. అదనపు ఎస్పీ ప్రసాద్, ఇన్‌ఛార్జి సహాయ పర్యవేక్షణాధికారి రాజశేఖర్‌గౌడ్, కర్నూలు స్టేషన్ సీఐ సత్యనారాయణ పాల్గొన్నారు.
ఇదీ చూడండి :