ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / crime

hyderabad murder: రౌడీషీటర్ దారుణ హత్య.. కత్తులతో నరికి చంపిన దుండగులు! - పాతబస్తీ నేర వార్తలు

హైదరాబాద్ లోని పాతబస్తీలో వరుస హత్యలు కలవరపెడుతున్నాయి. కొద్ది రోజుల క్రితం అందరూ చూస్తుండగానే రౌడీషీటర్‌ అసద్‌ ఖాన్‌‌ను వేటకొడవళ్లతో నరికి దుండగులు దారుణంగా హతమార్చారు. అది మరువక ముందే శుక్రవారం అర్ధరాత్రి మరో హత్య జరిగింది. ముస్తాక్ అనే రౌడీషీటర్​ను కత్తులతో నరికి చంపారు దుండగులు.

murder
murder

By

Published : Jul 17, 2021, 8:06 AM IST

హైదరాబాద్​ పాతబస్తీలో మరోసారి కత్తిపోట్ల కలకలం రేగింది. చాదర్ ఘాట్ పీఎస్‌ పరిధిలో ముస్తాక్ అలియాస్ ముస్తాక్ డాన్ అనే రౌడీషీటర్​ను కత్తులతో నరికి చంపారు కొందరు దుండగులు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృత దేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.

కేసు నమోదు చేసుకుని నిందితులకోసం గాలిస్తున్నారు. రెక్కీ నిర్వహించి మరీ హత్య చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ తరహా ఘటనలను కట్టడి చేసేందుకు పోలీసులు రౌడీషీటర్లకు కౌన్సిలింగ్​లతో పాటు హెచ్చరికలు జారీ చేస్తున్నా.. పాతబస్తీలో హత్యల పరంపర కొనసాగడం ఉన్నతాధికారులను కలవరపెడుతోంది.

ABOUT THE AUTHOR

...view details