విశాఖ జిల్లా ఎలమంచిలి మండలం పులపర్తిలో.. ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు మృతి చెందారు. తూర్పు గోదావరి జిల్లా ఆలమూరు మండలం చెముడులంకకు చెందిన శ్రీనివాసరావు.. తన కుటుంబసభ్యులతో కలిసి రాజమహేంద్రవరం నుంచి విశాఖకు కారులో బయలుదేరారు.
పులపర్తి సమీపంలో రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని కారుతో బలంగా ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో.. శ్రీనివాసరావు భార్య, కుమార్తె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. కారు నడుపుతున్న అతను తీవ్రంగా గాయపడ్డారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.