road accident: ఓ లారీ డ్రైవర్ నిర్లక్ష్యం ఫలితంగా ఓ గర్భిణి గంటపాటు తీవ్ర గాయాలపాలై కారులో నరకయాతనపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లాలో నిన్న ఉదయం రోడ్డు ప్రమాదం జరగగా ఇందుకు సంబంధించిన సీసీ పుటేజీ వెలుగులోకి వచ్చింది. తిమ్మాపూర్ మండలంలోని రేణికుంట టోల్ ప్లాజా వద్ద ఓ ట్రాక్టర్ డ్రైవర్ టోల్ రసీదు తీసుకుంటున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. ఆ ట్రాక్టర్ వెనక నిలిచిన ఆల్టో కారులో రజిత కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్ నుంచి సుల్తానాబాద్‌కు బయలు దేరారు. ఆ కారు వెనక మరో కారు కూడా టోల్ రశీదు కోసం వేచి ఉంది.
రెండు వాహనాల మధ్య ఇరుక్కొని.. గర్భిణి నరక యాతన! - కరీంనగర్ జిల్లా తాజా నేర వార్తలు
road accident: తెలంగాణలోని కరీంనగర్ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ లారీ డ్రైవర్ నిర్లక్ష్యం ఫలితంగా కారులో ప్రయాణిస్తున్న గర్భిణి తీవ్ర గాయాలపాలై గంటపాటు నరకయాతన అనుభవించింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో నిక్షిప్తమయ్యాయి.
ఇంతలో ఓ లారీ డ్రైవర్ అతివేగంతో వచ్చి వెనకున్న కారును ఢీకొట్టగా, ఆ కారు ముందున్న వారి ఆల్టో కారును ఢీకొంది. ఈ ఆల్టో ట్రాక్టర్‌ను ఢీకొట్టింది.. ప్రమాద వేగానికి ఆల్టో కారు నుజ్జు నుజ్జయింది. కారు డోర్ తెరుచుకోకపోవడంతో గర్భిణి రజిత, భర్త మహేందర్ అందులోనే ఇరుక్కుపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు టోల్‌ప్లాజా సిబ్బంది, స్థానికుల సాయంతో గంటపాటు శ్రమించి దంపతులిద్దరినీ కారులోంచి బయటకు తీశారు. రజితకు తీవ్రగాయాలు కాగా, మహేందర్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. రజితను కరీంనగర్‌లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఈ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి.
ఇదీ చదవండి:రాత్రివేళ ఆటోలో ఒంటరిగా యువతి.. ముగ్గురు యువకులు వేరే దారికి తీసుకెళ్లి..