Road Accident: కర్ణాటకలోని బీదర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదంలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. బీదర్ జిల్లా బంగూర్ వద్ద హైవేపై కంటైనర్‌ను వెనకనుంచి ఢీకొన్న ఘటనలో చిన్నారి సహా ఆరుగురు మృతి చెందారు. మరో నలుగురు గాయపడ్డారు. మృతులంతా హైదరాబాద్ నాగోల్ వాసులని, ఒకే కుటుంబానికి చెందినవారని గుర్తించారు. కలబురిగి జిల్లా గాన్గాపూర్‌కు కారులో దత్తాత్రేయ ఆలయ దర్శనానికి వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది.
బీదర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం, ఆరుగురు హైదరాబాద్ వాసులు మృతి - ఐదుగురు మృతి
Five died in road accident కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఐదుగురు మృతి చెందగా.. మరో ఐదుగురు గాయపడ్డారు.
![బీదర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం, ఆరుగురు హైదరాబాద్ వాసులు మృతి 2](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-16111382-195-16111382-1660576034672.jpg)
2
పోలీస్ డిపార్ట్మెంట్లో పని చేస్తున్న 45 ఏళ్ల గిరిధర్, 30ఏళ్ల అనిత, 15 ఏళ్ల ప్రియ, రెండేళ్ల వయసున్న మహేష్‌తో పాటు.. డ్రైవర్ జగదీష్ ప్రమాదంలో మృతిచెందారు. మరొకరి గురించి తెలియాల్సి ఉంది. ప్రమాదంలో గాయపడ్డ నలుగురు జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గిరిధన్ కుటుంబం నాగోల్‌లో నివాసం ఉంటోంది. గిరిధర్ హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో కోర్ట్ కానిస్టేబుల్‌గా పని చేస్తున్నాడు.
ఇవీ చదవండి:
Last Updated : Aug 15, 2022, 9:47 PM IST