బాపట్లలో రోడ్డు ప్రమాదం.. నలుగురు అయ్యప్ప భక్తుల దుర్మరణం - Road Accident To Ayyappa Devotees in Bapatla
08:28 December 05
మృతులు కృష్ణా జిల్లా వాసులుగా గుర్తింపు
Road Accident బాపట్ల జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. వేమూరు మండలం జంపని సమీపంలో అయ్యప్ప భక్తులు ప్రయాణిస్తున్న టాటా ఏస్ వాహనం బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఘటనాస్థలంలో ముగ్గరు మరణించగా మిగతా వారికి గాయాలయ్యాయి. క్షతగాత్రులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రమాద సమయంలో వాహనంలో 23 మంది ప్రయాణికులు ఉన్నారు. గాయపడిన వారిని తెనాలిలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మరో వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. దీంతో మృతుల సంఖ్య నాలుగుకు చేరింది. మరణించిన వారు కృష్ణా జిల్లా కృతివెన్ను మండలానికి చెందిన బొలిశెట్టి పాండురంగారావు, పాశం రమేష్, బోదిన రమేష్, బుద్దన పవన్ కుమార్‌గా వారిగా గుర్తింంచారు. ప్రస్తుతం గాయపడిన వారిని తెనాలి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. గాయపడిన వారిలో మరో ముగ్గురు భరత్ కుమార్, పుప్పాల శ్రీనివాసరావు, లింకన్ పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు.
అసలు ప్రమాదం ఎలా జరిగిందంటే: కృష్ణా జిల్లాకు కృతివెన్ను మండలానికి చెందిన 23 మంది అయ్యప్ప భక్తులు శబరిమల వెళ్లి రైలు మార్గంలో తిరిగి పయనమయ్యారు. శబరిమల నుంచి తెనాలికి చేరుకున్నారు. అక్కడ నుంచి టాటా ఏసీ వాహనం మాట్లాడుకుని స్వగ్రామానికి తిరుగు పయనమయ్యారు. ఈ క్రమంలో బాపట్ల జిల్లా వేమూరు మండలం జంపని వద్దకు రాగానే.. పొగ మంచు ఎక్కువగా ఉండటంతో మూల మలుపు వద్ద వీరు ప్రయాణిస్తున్న వాహనం బొల్తా పడింది.
ఇవీ చదవండి: