ACCIDENT: కాకినాడ జిల్లా తుని మండలం వెలమ కొత్తూరు వద్ద జాతీయ రహదారిపై తెల్లవారుజామున ఘోర ప్రమాదం జరిగింది. ఆగివున్న లారీ ని టాటా మ్యాజిక్ వాహనం ఢీ కొట్టింది. వాహనం లో 12 మంది ప్రయాణికులు ఉండగా, సంఘటన స్థలంలో ఒకరు మృతి చెందారు. 11 మందికి తీవ్ర గాయాలుకాగా ఐదుగురు పరిస్టితి విషమంగా ఉంది. ఎక్కువ మంది చిన్నారులకు ఎముకలు విరిగి తీవ్ర గాయాలయ్యాయి. వీరికి 108 లో తుని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందించారు. అనంతరం కాకినాడ, విశాఖ ఆసుపత్రులకు తరలించారు. విజయనగరం జిల్లా అగ్రహారం నుంచి రామచంద్రపురం శుభకార్యానికి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. గాయాల పాలైన వారిలో విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల వారు ఉన్నారు. రెండు వాహనాల్లో వెళ్తుండగా ఒక వాహనం ప్రమాదానికి గురయింది.
కాకినాడలో రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి.. పలువురికి గాయాలు - crime news in ap
ACCIDENT: కాకినాడ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తుని మండలంలోని వెలమకొత్తూరు వద్ద ఆగి ఉన్న లారీని టాటా మ్యాజిక్ వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా పలువురికి గాయాలయ్యాయి.
ACCIDENT
Last Updated : Aug 3, 2022, 9:13 AM IST