Road Accident at Tummanoor Today: తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా మహేశ్వరం పోలీస్ స్టేషన్ పరిధి తుమ్మనూరు గేట్ సమీపంలో గురువారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. కారును డీసీఎం ఢీకొన్న ఘటనలో నలుగురు మృతి చెందారు. వీరంతా హైదరాబాద్లో జరిగిన ఓ శుభకార్యంలో వంట చేసేందుకు వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. గమనించిన వాహనదారులు పోలీసులకు సమాచారం అందించారు. మృతులను నాగర్కర్నూల్ జిల్లా వాసులుగా పోలీసులు గుర్తించారు.
తెలంగాణలో రోడ్డు ప్రమాదం.. నలుగురు దుర్మరణం - తుమ్మలూరు వద్ద రోడ్డు ప్రమాదం నలుగురి మృతి
Road Accident at Tummanoor: తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నలుగురు దుర్మరణం చెందారు.
Road Accident at Tummanoor
మృతులు నాగర్కర్నూల్ జిల్లా వెల్దండ మండలం పోతేపల్లి గ్రామానికి చెందిన కేశవులు(35), యాదయ్య(34), శ్రీను(30), లింగారెడ్డిపల్లి గ్రామానికి చెందిన రామస్వామి(32)గా పోలీసులు గుర్తించారు. నలుగురి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి పంపించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చదవండి: