ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / crime

Death: అదుపు తప్పిన బైక్.. మహిళ మృతి - women died

అదుపు తప్పి బైక్​పై నుంచి పడి ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన అనంతపురం జిల్లా తలుపుల మండలం తొగటివారిపల్లి వద్ద జరిగింది.

road accident at thoguta on thogativaripalli one died
అదుపు తప్పిన బైక్.. మహిళ మృతి

By

Published : Jul 3, 2021, 11:18 PM IST

మనుమడి తలనీలాల వేడుకకు బంధువులను ఆహ్వానించేందుకు కుమారుడుతో కలిసి ద్విచక్రవాహనంపై బయలుదేరిన మహిళ రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయింది. అనంతపురం జిల్లా గాండ్లపెంట మండలం వంకపల్లికి చెందిన ఈశ్వరమ్మ కొడుకుతో కలిసి తలుపుల మండలం తొగటివారిపల్లిలో బంధువుల ఇంటికి వెళ్తున్న సమయంలో బైక్​పై నుంచి కిందపడిపోయింది. వాహనం అదుపు తప్పడం వల్ల జరిగిన ఈ ప్రమాదంలో ఈశ్వరమ్మ తలకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఆమె అక్కడిక్కక్కడే ప్రాణాలు కోల్పోయింది. కుమారుడుకి స్వల్పగాయాలయ్యాయి.

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details