విజయనగరం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం... ముగ్గురు చిన్నారులు మృతి - Today crime news
![విజయనగరం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం... ముగ్గురు చిన్నారులు మృతి Road accident at tekkalivalasa](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-14740336-757-14740336-1647348714759.jpg)
17:24 March 15
ద్విచక్రవాహనాన్ని ఢీకొన్న ప్రైవేట్ పాఠశాల బస్సు
Road accident at tekkalivalasa: విజయనగరం జిల్లా తెర్లాం మండలం టెక్కలివలసలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్రవాహనాన్ని ప్రైవేటు పాఠశాల బస్సు ఢీకొనడంతో... ముగ్గురు చిన్నారులు అక్కడికక్కడే మృతి చెందారు. పెరుమాలి గ్రామానికి చెందిన మురళి తన పిల్లలతో పాటు... మేనల్లుడితో సహా మొత్తం ఐదుగురు రాజాం జాతరకు ద్విచక్రవాహనంపై వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
ఈ ఘటనలో మైలిపల్లి మురళికి చెందిన కుమారులు సిద్ధూ (9), హర్ష(8)తో పాటు... ఆయన మేనల్లుడు వడ్డ రుషి(8) అక్కడికక్కడే మరణించారని పోలీసులు తెలిపారు. ద్విచక్ర వాహనదారుడు మురళితో పాటు మరో వ్యక్తికి స్వల్ప గాయాలు కావడంతో రాజాం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టామని పోలీసులు పేర్కొన్నారు.
ఇదీ చదవండి:Crime News: భార్యను చంపి లొంగిపోయిన భర్త.. అదే కారణమా?