Road Accident at srirangapuram:ప్రకాశం జిల్లా కనిగిరి మండలం శ్రీరంగాపురం గ్రామం వద్ద ద్విచక్రవాహనాన్ని ట్రాక్టర్ ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్‌పై వెళ్తున్న అయ్యప్ప(24)అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందగా.. వంశీ అనే మరో యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుడు హనుమంతునిపాడు మండలం కోటతిప్పల గ్రామానికి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు.
ద్విచక్రవాహనాన్ని ఢీకొన్న ట్రాక్టర్... ఒకరు మృతి - AP Crime news
Road Accident at srirangapuram: ద్విచక్రవాహనాన్ని ట్రాక్టర్ ఢీకొన్న ఘటన ప్రకాశం జిల్లా కనిగిరి మండలం శ్రీరంగాపురంలో జరిగింది. బైక్‌పై వెళ్తున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా.. మరో యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుడు కోటతిప్పల గ్రామానికి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు.

Road Accident at srirangapuram
హనుమంతునిపాడు నుంచి కనిగిరి వైపు వెళ్తున్న ద్విచక్రవాహనాన్ని.. ఎదురుగా వస్తున్న ట్రాక్టర్ శ్రీరంగాపురం వద్ద ఢీకొన్నట్లుగా స్థానికులు తెలిపారు. ఘటన స్థలం నుంచి ట్రాక్టర్‌తో సహా డ్రైవర్ పరారవ్వగా.. పోలీసులు వెంబడించి అదుపులోకి తీసుకున్నారు. కనిగిరి పోలీస్ స్టేషన్‌కి తరలించారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు హనుమంతునిపాడు ఎస్సై పావని తెలిపారు.
ఇదీ చదవండి:Driver rapes woman: కదులుతున్న బస్సులో మహిళపై డ్రైవర్ అత్యాచారం