Road Accident at ravulapalem: తూర్పు గోదావరి జిల్లా రావులపాలెం మండలం రావులపాడు జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. అక్రమంగా గంజాయిని తరలిస్తున్న కారు... రావులపాలెం ఆర్టీసీ డిపో వద్ద గల బస్సును వెనకనుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు గాయపడ్డారు. విశాఖ జిల్లా పాడేరు నుంచి ఏడుగురు వ్యక్తులు ఇన్నోవా వాహనంలో గంజాయి తరలిస్తున్నట్లు పోలీసులు కనుగొన్నారు.
Road Accident at ravulapalem: ఆర్టీసీ బస్సుని ఢీకొన్న కారు... ఇద్దరికి గాయాలు - తూర్పు గోదావరి జిల్లాలో రోడ్డు ప్రమాదం
Road Accident at ravulapalem: అక్రమంగా గంజాయిని తరలిస్తున్న కారు... ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన ఘటన తూర్పు గోదావరి జిల్లాలో జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు గాయపడ్డారు. కారులో ఉన్న నలుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు... మరో వ్యక్తి పరారీలో ఉన్నట్లు తెలిపారు.
Road Accident at ravulapalem
క్షతగాత్రులని రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, కారులో ఉన్న నలుగురిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. మరో వ్యక్తి పరారీలో ఉన్నట్లు వెల్లడించారు.