One died in Road Accident: గుంటూరు జిల్లా పెదకాకాని జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. విజయవాడ నుంచి గుంటూరు వైపు వస్తున్న కారు కంటైనర్‌ని ఢీ కొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న నలుగురిలో ఒకరు మృతి చెందగా.. మిగతా ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. కారులో చిక్కుకున్న వారిని బయటకు తీసేందుకు స్థానికులు తీవ్ర అవస్థలు పడ్డారు. ఈ ప్రమాదంతో జాతీయ రహదారిపై సుమారు రెండు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ఘటనస్థలానికి చేరుకున్న పోలీసులు కారులో చిక్కుకున్న మృతదేహాన్ని బయటకు తీసి వాహన రాకపోకలను క్రమబద్ధీకరించారు. మృతుడు తాడేపల్లి మండలం కుంచనపల్లికి చెందిన వ్యక్తిగా పోలీసులు అనుమానిస్తున్నారు.
Accident: పెదకాకాని దగ్గర కంటైనర్‌ని ఢీ కొట్టిన కారు.. ఒకరు మృతి - కంటైనర్‌ని ఢీకొట్టిన కారు
Car hit to Container at Pedakakani: పెదకాకాని దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. కంటైనర్‌ని కారు ఢీకొని ఒకరు మృతి చెందగా.. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. రోడ్డు ప్రమాదంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పోలీసులు చేరుకుని వాహనాల రాకపోకలను క్రమబద్దీకరించారు.

accident
పెదకాకాని దగ్గర కంటైనర్‌ని ఢీ కొట్టిన కారు.. ఒకరు మృతి
Last Updated : Aug 6, 2022, 5:21 PM IST