ACCIDENT: బాపట్ల జిల్లా కొరిశపాడు మండలం మేదరమెట్ల జాతీయ రహదారిపై ప్రమాదం చోటుచేసుకుంది. ఒంగోలు నుంచి విజయవాడ వైపు నిమ్మకాయల లోడుతో వెళ్తున్న లారీని కోళ్లలోడుతో వెళ్తున్న మరో లారీ ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ముగ్గురికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. మృతులు రాజా(30), శివ(26)లను ఎన్టీఆర్ జిల్లా వాసులుగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ACCIDENT: రెండు లారీలు ఢీ.. ఇద్దరు మృతి - బాపట్ల జిల్లా తాజా వార్తలు
ACCIDENT: బాపట్ల జిల్లా కొరిశపాడు మండలం మేదరమెట్ల జాతీయ రహదారిపై ప్రమాదం జరిగింది. ముందు వెళ్తున్న లారీని మరో లారీ ఢీకొట్టడంతో ఇద్దరు మృత్యువాత పడ్డారు.
బాపట్ల జిల్లాలో రెండు లారీలు ఢీ