ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / crime

మర్రిపాడులో రోడ్డు ప్రమాదం.. ఒకదాన్నొకటి ఢీకొన్న నాలుగు లారీలు! - నెల్లూరు జిల్లా వార్తలు

నెల్లూరు జిల్లా మర్రిపాడు సెంటర్​లో రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వస్తున్న నాలుగు లారీలకు ఆవులు అడ్డు రావడంతో.. ముందు వెళ్తున్న లారీ డ్రైవర్ సడన్ బ్రేక్ వేశాడు. దీంతో నాలుగు లారీలు ఒకదానినొకటి ఢీకొన్నాయి.

మర్రిపాడు సెంటర్​లో తప్పిన ఘోర రోడ్డు ప్రమాదం
మర్రిపాడు సెంటర్​లో తప్పిన ఘోర రోడ్డు ప్రమాదం

By

Published : Mar 14, 2022, 8:58 PM IST

నెల్లూరు జిల్లా మర్రిపాడు సెంటర్​లో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వస్తున్న నాలుగు లారీలకు ఆవులు అడ్డు వచ్చాయి. దీంతో ముందు వెళ్తున్న లారీ సడన్​గా బ్రేక్ వేయడంతో నాలుగు లారీలు ఒకదానినొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఓ లారీ క్యాబిన్ నూజ్జు నూజ్జు కావడంతో... డ్రైవర్ క్యాబిన్​లో చిక్కుకుపోయాడు.

వెంటనే స్పందించిన స్థానికులు, పోలీసులు తీవ్రగాయాలతో క్యాబిన్​లో ఇరుక్కున్న డ్రైవర్​ని బయటకు తీసి చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. నాలుగు లారీలు నెల్లూరు నుండి కడప వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో స్థానికులు ఊపిరిపీల్చుకున్నారు.

ఇదీ చదవండి:శిశువు తల నోట కరచుకొని పరిగెత్తిన కుక్క.. ఎక్కడంటే?

ABOUT THE AUTHOR

...view details