శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసలో ఘోర ప్రమాదం జరిగింది. రోడ్డు పక్క నుంచి నడుచుకుంటూ వెళ్తున్న ఉపాధి హామీ కూలీలపైకి ఓ లారీ అదుపుతప్పి వేగంగా దూసుకెళ్లింది. ఆమదాలవలస-పాలకొండ రోడ్డుపై మందాడ గ్రామం వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో నలుగురు దుర్మరణం చెందారు. పలువురికి తీవ్రగాయాలయ్యాయి. ఇందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటినా ఘటనాస్థలానికి చేరుకున్నారు. మృతి చెందినవారు మందాడ గ్రామానికి చెందినవారుగా గుర్తించారు. క్షతగాత్రులను 108 వాహనంలో శ్రీకాకుళం సర్వజన ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
శ్రీకాకుళం జిల్లాలో రోడ్డు ప్రమాదం.. లారీ ఢీకొని నలుగురు దుర్మరణం - andhra pradesh news

accident in srikakulam
17:04 February 04
మరొకరి పరిస్థితి విషమం, ఆస్పత్రికి తరలింపు
Last Updated : Feb 5, 2023, 6:32 AM IST