వాట్సప్‌లో.. చిన్నారిని అమ్మకానికి పెట్టిన ఆర్‌ఎంపీ..! - విజయవాడ తాజా వార్తలు
12:02 June 01
CHILD: ఓ ఆర్‌ఎంపీ వైద్యుడు మూడు రోజుల పసికందును అమ్మకానికి పెట్టాడు. ఈ దారుణ ఘటన విజయవాడలో జరిగింది. నగరంలో ఉంటున్న అమృతరావు గతకొంతకాలంగా జి.కొండూరు మండలంలో ఆర్‌ఎంపీ డాక్టర్‌గా ప్రాక్టీస్ చేస్తున్నాడు. 3 రోజుల పసిపాపను ఆయన అమ్మకానికి పెట్టాడు. ఇందుకు సంబంధించిన సమాచారాన్ని ఓ వాట్సప్ గ్రూపులో అమృతరావు పోస్ట్ చేశాడు. రూ.3లక్షలకు ఆ పసికందును అమ్మకానికి ఉంచినట్లు పేర్కొన్నాడు. ఈ విషయం తెలసుకున్న "దిశ" పోలీసులు.. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
ఇవీ చదవండి: