అనంతపురం జిల్లా కూడేరు రెవెన్యూ కార్యాలయంలో ఓ అధికారి లంచం తీసుకుంటున్న వీడియో సామాజిక మాధ్యమంలో వైరల్ అయింది. అవినీతి ఆరోపణలతో గతంలో అదే కార్యాలయంలోని ఐదుగురు అధికారులు సస్పెండ్ అయినా ప్రస్తుతం ఉన్న అధికారుల్లో ఎలాంటి మార్పు లేదనేందుకు ఈ వీడియో ఉదాహరణగా నిలుస్తోంది. తాజాగా.. ఆర్.ఐ శివారెడ్డి.. రైతుల నుంచి లంచం తీసుకుంటున్న ఆన్లైన్లో చక్కర్లు కొడుతుంది.
ఆరవకూరు, కమ్మూరు రైతులకు సంబంధించి అన్లైన్లో పేర్లు నమోదు చేయడానికి ఆర్.ఐ శివారెడ్డి రూ. 10వేలు లంచం డిమాండ్ చేశాడు. అయితే రైతు లంచం ఇస్తూ ఫోన్లో రికార్డు చేయడంతో ఆ అధికారి అవినీతి బండారం బయటపడింది. ఇప్పటికే జిల్లా ఉన్నతాధికారులు సదరు వీడియోపై స్పందించారు. విచారణ జరిపి సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.