కడప జిల్లా ఓబులవారిపల్లె మండలంలో ఎర్రచందనం దుంగలు పట్టుబడ్డాయి. ఓబులవారిపల్లె మండలంలోని వేర్వేరు ప్రాంతాల్లో 14 ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈరోజు తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో ఓబులవారిపల్లె మండలం కనిగట్టు ప్రాంతంలో తొమ్మిది ఎర్రచందనం దుంగలు పట్టుబడ్డాయి. తొమ్మిది మంది స్మగ్లర్లను టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.21 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ తొమ్మిది మంది రైల్వేకోడూరు చుట్టుపక్కల గ్రామాలకు చెందినవారిగా గుర్తించామని టాస్క్ఫోర్స్ డీఎస్పీ గిరిధర్ అన్నారు. ఎవరైనా ఎర్రచందనం అక్రమ రవాణా చేస్తున్నారని తెలిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు.
ఓబులవారిపల్లెలో ఎర్రచందనం దుంగల పట్టివేత - redsanal iligal transport at kadapa
కడప జిల్లా ఓబులవారిపల్లె మండలంలో వేర్వేరుచోట్ల 14 ఎర్రచందనం దుంగలు పట్టుబడ్డాయి. ఓబులవారిపల్లె మండలం కనిగట్టు ప్రాంతంలో తొమ్మిది ఎర్రచందనం దుంగలు, గాదెలలో ఐదు ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
![ఓబులవారిపల్లెలో ఎర్రచందనం దుంగల పట్టివేత red sandal caught at kadapa district obhulavaripalle](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11425539-39-11425539-1618571289277.jpg)
red sandal caught at kadapa district obhulavaripalle
ఓబులవారిపల్లె మండలం గాదెలలో అక్రమంగా తరలిస్తున్న ఐదు ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఒక స్మగ్లర్ను అదుపులోకి తీసుకున్నారు. ఎర్రచందనం దుంగల విలువ సుమారు రూ.4 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. సమాచారం మేరకు తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో గాదెలలో తనిఖీ చేపట్టినట్లు రైల్వేకోడూరు సీఐ ఆనందరావు తెలిపారు.
ఇదీ చదవండి: ప్రధానికి సీఎం జగన్ లేఖ.. 60 లక్షల కరోనా వ్యాక్సిన్లు పంపాలని విజ్ఞప్తి