ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Rape On Minor Girl: 7వ తరగతి బాలికపై యజమాని అత్యాచారం..

By

Published : Mar 22, 2022, 1:11 AM IST

Updated : Mar 22, 2022, 6:09 AM IST

Rape On Minor Girl: నమ్మిన వారినే కామంతో కాటేశాడు ఓ కామాంధుడు. పని చేసేందుకు ఇంటికి వచ్చిన బాలికపై అత్యాచారానికి ఒడిగట్టాడు యజమాని. ఈ ఘటన విజయవాడలోని కొత్తపేటలో జరిగింది. బాధితురాలి కుటుంబసభ్యుల ఫిర్యాదుతో పోక్సో చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Rape On Minor Girl in vijayawada
Rape On Minor Girl in vijayawada

Rape On Minor Girl: విజయవాడలోని కొత్తపేటలో దారుణం జరిగింది. పని చేసేందుకు ఇంటికి వచ్చిన బాలికపై యజమాని అత్యాచారానికి ఒడిగట్టాడు. కొత్తపేటకు చెందిన ఓ బాలిక తల్లిదండ్రులు చనిపోగా... పెద్దమ్మ పెదనాన్న వద్ద ఉంటోంది. 7వ తరగతి చదువుతున్న ఈ బాలిక... కొత్తపేటలో ఉంటున్న రాజు అనే వ్యక్తి ఇంటికి పని నిమిత్తం సోదరుడితో కలిసి రెండు వారాలు క్రితం వెళ్లింది.

పని చేసేందుకు ఇంటికి వచ్చిన బాలికను... రాజు తన గదిలోకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. ఈ విషయం కుటుంబసభ్యులకు తెలియడంతో వారు...మహిళా పోలీసుస్టేషన్​లో ఫిర్యాదు చేశారు. బాధితురాలి కుటుంబసభ్యుల ఫిర్యాదుతో పోక్సో చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Last Updated : Mar 22, 2022, 6:09 AM IST

ABOUT THE AUTHOR

...view details