తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ మణికొండలో డ్రైనేజీ గుంతలో పడి గల్లంతైన రజినీకాంత్ మృతదేహం (rajinikanth dead body found) లభ్యమైంది. డ్రైనేజీ కలిసే నెక్నాంపూర్ చెరువులో(dead body found in Neknampur Pond)మృతదేహం కనిపించింది. గోపిశెట్టి రజినీకాంత్ సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పని చేస్తున్నారు. శనివారం రాత్రి 9 గంటలకు ఇంటి నుంచి బయటకు వచ్చిన రజినీకాంత్... నిర్మాణంలో ఉన్న డ్రైనేజీ గుంతలో పడి గల్లంతయ్యారు. మూడ్రోజులుగా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, పోలీసులు, జీహెచ్ఎంసీ సిబ్బంది ముమ్మరంగా వెతికారు.
డ్రైనేజీ దారిగుండా వెళ్లి గాలింపు చేపట్టారు. వర్షం కారణంగా గాలింపునకు అంతరాయం ఏర్పడగా.. వాన తగ్గిన తర్వాత వెతుకులాట కొనసాగించారు. నెక్నాంపూర్ చెరువులో జేసీబీ సాయంతో గుర్రపుడెక్క తొలగింపు పనులు చేపట్టగా.. రజినీకాంత్ మృతదేహాన్ని ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది గుర్తించారు.