చేతబడి చేస్తున్నాడనే నెపంతో రైల్వే ఒప్పంద ఉద్యోగి హత్య.. తోటి కార్మికులే - Railway Contract Employee Murder
16:33 September 15
ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు
Murder In West Godavari: పశ్చిమ గోదావరి జిల్లాలో దారుణం జరిగింది. చేతబడి చేస్తున్నాడనే నెపంతో ఓ వ్యక్తి హత్యకు గురయ్యాడు. పశ్చిమ గోదావరి జిల్లాలోని తణుకు సమీపంలోని చిలకపాడులో రైల్వే ఒప్పంద ఉద్యోగి లాల్‌గూరిని తోటి కార్మికులు హత్య చేశారు. చేతబడి అనుమానంతో లాల్‌గూరిని హత్య చేసి మృతదేహన్ని రైలు పట్టాలపై పడేశారు. ఈ నెల 12వ తేదిన పోలీసులు మృతదేహన్ని గమనించి.. కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. అనంతరం ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. హత్యకు గురైన లాల్‌గూరి ఝార్ఖండ్ చెందిన వ్యక్తి అని పోలీసులు గుర్తించారు. గత మూడేళ్లుగా ఇక్కడే ఒప్పంద కార్మికునిగా విధులు నిర్వహిస్తున్నాడు.
ఇవీ చదవండి: