ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / crime

RAGGING: ఎస్కేయూలో ర్యాగింగ్‌.. పోలీస్‌స్టేషన్‌ వరకు వెళ్లిన వివాదం - అనంతపురం జిల్లా తాజా వార్తలు

RAGGING: శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం భౌతికశాస్త్ర విభాగంలో ర్యాగింగ్‌ జరిగిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సీనియర్లు, జూనియర్ల మధ్య పరిచయ కార్యక్రమాల అనంతరం ఫోన్​ నెంబర్లు మార్చుకున్నారు. ఓ జూనియర్‌ విద్యార్థి సీనియర్‌ విద్యార్థినికి ఫోన్‌లో అసంబద్ధమైన సందేశాలు పంపినట్లు సమాచారం. దాంతో వారి మధ్య వివాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో సీనియర్లు చేయి చేసుకున్నట్లు తెలిసింది.

RAGGING
RAGGING

By

Published : Jul 4, 2022, 7:17 AM IST

RAGGING: అనంతపురం జిల్లా శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం భౌతికశాస్త్ర విభాగంలో ర్యాగింగ్‌ జరిగిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ విభాగంలో సీనియర్లు, జూనియర్ల మధ్య పరిచయ కార్యక్రమాలు జరిగాయి. పరస్పరం ఫోన్‌ నంబర్లు మార్చుకున్నారు. ఓ జూనియర్‌ విద్యార్థి సీనియర్‌ విద్యార్థినికి ఫోన్‌లో అసంబద్ధమైన సందేశాలు పంపినట్లు సమాచారం. సీనియర్‌ విద్యార్థినులు అబ్బాయిలకు ఈ విషయం తెలిపారు. జూనియర్‌ విద్యార్థి కర్నూలు జిల్లా వాసి కావడంతో సీనియర్లు అతడి కోసం అక్కడికి వెళ్లారు. అక్కడ లేకపోవడంతో వెనక్కి వచ్చారు. ఆ తరువాత జూనియర్‌ను సీనియర్లు వసతి గృహంలోని వారి గదికి పిలిపించారు. అక్కడ వారి మధ్య వివాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో సీనియర్లు చేయి చేసుకున్నట్లు తెలిసింది. దీంతో ఆ విద్యార్థి తల్లిదండ్రులు ఎస్కేయూకు వచ్చారు. సీనియర్లపై కేసు పెట్టేందుకు జూనియర్‌ విద్యార్థి తల్లి ప్రయత్నించారు. వివాదం ఉపకులపతి వరకూ వెళ్లడంతో సీనియర్లపై కేసు నమోదు చేయాలని, జూనియర్‌ విద్యార్థికి టీసీ ఇచ్చి పంపాలని నిర్ణయానికి వచ్చారు. ఇటుకలపల్లి పోలీసు స్టేషన్‌కు వెళ్లడంతో శనివారం రాత్రి ఇరువర్గాలను రాజీ చేసి పంపారు. ఈ విషయమై ప్రిన్సిపాళ్లు బాలసుబ్రమణ్యం, జీవన్‌కుమార్‌ల వివరణ కోరగా.. పోలీసు స్టేషన్‌లో రాజీ అయ్యారని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఇరువర్గాలతో స్టేషనులో రాయించుకున్నట్లు తెలిపారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details