గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్న ఇద్దరు విదేశీయులను రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. సోమవారం నేరెడ్‌మెట్‌లో డెకాయి ఆపరేషన్ నిర్వహించి టాంజానియాకు చెందిన డయానా(24), కాబాంగిలా వారెన్(24)ను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. డయానా, వారెన్ స్టడీ వీసాపై గతేడాది జనవరిలో హైదరాబాద్‌కు వచ్చారు. రెండు నెలల కిందట తార్నాక నుంచి నేరెడ్‌మెట్‌కు మకాం మార్చారు. భార్యాభర్తలమని చెప్పి అక్కడ గది అద్దెకు తీసుకున్నారు.
చదువు కోసమొచ్చి.. వ్యభిచారం వృత్తి
చదువుకునేందుంకంటూ టాంజానియా నుంచి హైదరాబాద్‌కు వచ్చారు ఆ అమ్మాయి, అబ్బాయి. కానీ ఇక్కడకు వచ్చి.. వ్యభిచారం చేస్తూ జీవనాన్ని సాగిస్తున్నారు. స్థానికుల సమాచారంతో పోలీసులు వీరి బండారాన్ని బయటపెట్టారు.
rachakonda police arrested two foreigners for prostitution in hyderabad
మీట్24 యాప్‌లో డయానా రిజిస్టర్ చేసుకొని.. వినియోగదారులను ఇంటికి రావాలంటూ ఆహ్వానించేది. విశ్వసనీయవర్గాల సమాచారం మేరకు మల్కాజిగిరి ఎస్వోటీ, నేరెడ్‌మెట్ పోలీసులు సంయుక్తంగా ఆ ఇంటిపై దాడులు నిర్వహించి ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. పాస్‌పోర్టులు, మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. వీసా గడువు ముగిసినా అక్రమంగా ఉంటున్నట్లు గుర్తించారు.
ఇదీ చూడండి: