ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / crime

Cyber Criminal Arrest: లాటరీ వచ్చిందని మహిళకు బురిడీ.. సైబర్​ నేరగాడి అరెస్టు.. - cyber crime latest news

Cyber Criminal Arrest: సైబర్ నేరగాళ్ల బారినపడతున్న బాధితుల సంఖ్య.. తెలంగాణ రాష్ట్రంలోని జంట నగరాల్లో రోజురోజుకూ పెరుగుతోంది. పోలీసులు, మీడియా విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నా.. పరిస్థితిలో మార్పు రావడం లేదు. ఓ మహిళ ఆన్​లైన్​లో షాపింగ్​ చేయగా.. ఓ నెంబర్​ నుంచి ఫోన్​ వచ్చింది. తమకు 5 లక్షల విలువైన కారు లాటరీలో వచ్చిందని సైబర్​ నేరగాడు నమ్మించాడు. కొన్ని ఛార్జీల పేరిట పలుమార్లు డబ్బులు వసూలు చేశాడు. ఆ తర్వాత నేరగాడి నుంచి ఎంతకీ స్పందన లేకపోవడంతో తాను మోసపోయానని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

rachakonda police arrested cyber criminal
లాటరీ వచ్చిందని మహిళను బురిడీ కొట్టించిన సైబర్​ నేరగాడు అరెస్ట్​

By

Published : Mar 5, 2022, 12:10 PM IST

Cyber Criminal Arrest: సైబర్‌ నేరాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర నేరగాడిని.. తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్​లోని రాచకొండ సైబర్‌ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. ఓ మహిళను బురిడీ కొట్టించి ఆమె నుంచి 28 లక్షల 86 వేల రూపాయలు నేరగాడు కొల్లగొట్టినట్టు రాచకొండ సీపీ మహేష్‌ భగవత్‌ తెలిపారు. బిహార్‌ రాష్ట్రం నవాడ జిల్లాకు చెందిన రాజేష్‌ కుమార్‌.. సికింద్రాబాద్‌ తిరుమలగిరి ప్రాంతానికి చెందిన వెంకాయమ్మను మోసం చేసి డబ్బులు దండుకున్నాడు. ఇటీవల వెంకాయమ్మ ఆన్‌లైన్‌ ఇ-కామర్స్‌... షాప్‌ క్లూస్‌ ద్వారా ఆడియో ఇయర్‌ ఫోన్‌లను ఆర్డర్‌ చేసింది. ఆ తర్వాత ఆమెకు వివిధ ఫోన్‌ నెంబర్ల నుంచి ఫోన్లు రావడం మొదలైంది.

వివరాలు వెల్లడిస్తున్న రాచకొండ సీపీ మహేష్‌ భగవత్‌

లాటరీని వచ్చిందని..

షాప్‌ క్లూస్‌ నుంచి మాట్లాడుతున్నానని తన పేరు అశోక్‌ అని వెంకాయమ్మకు చెప్పి ఆమెకు 15 లక్షల విలువైన కారు లాటరీలో వచ్చిందని తెలిపాడు. కారు కావాలా లేక డబ్బులు కావాలా అని అడిగాడు. ఇందుకు ఆమె డబ్బులే కావాలని చెప్పింది. ముందుగా 8500 రూపాయలు చెల్లిస్తే.. డబ్బులు వస్తాయంటూ సదరు నేరగాడు బుకాయించాడు. అతను సూచించిన బ్యాంకు ఖాతాకు ఆమె డబ్బులు జమ చేసింది. ఈ విధంగా ప్రాసెసింగ్‌, రిజిస్ట్రేషన్‌ ఇతర ఛార్జీల పేరిట డబ్బులు జమ చేయాలంటూ పలు మార్లు రూ. 28 లక్షల 86 వేల రూపాయలు నేరగాడి ఖాతాలకు బదిలీ చేసింది.

మోసపోయానని గ్రహించి..

ఆ తర్వాత నేరగాడి నుంచి ఎంతకీ స్పందన లేకపోవడంతో తాను మోసపోయానని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. సాంకేతిక ఆధారాల ద్వారా నిందితుడిని గుర్తించిన పోలీసులు అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి 3.50 లక్షల రూపాయలు, నాలుగు చరవాణులు, రెండు డెబిట్‌ కార్డులు, 5 బ్యాంకు పాస్‌పుస్తకాలు, నాలుగు చెక్‌ పుస్తకాలు, ఆధార్‌, పాన్‌ కార్డు స్వాధీనం చేసుకున్నారు. సైబర్‌ నేరగాడి బ్యాంకు ఖాతాలోని 21 లక్షల రూపాయలు పోలీసులు స్తంభింపజేశారు. సైబర్‌ నేరం ద్వారా డబ్బులు కోల్పోయిన బాధితులు 24 గంటల్లోపు 1930 ఫోన్ నెంబర్‌కు సమాచారం ఇవ్వాలని రాచకొండ సీపీ మహేష్‌ భగవత్‌ తెలిపారు. లేని పక్షంలో www.cyber.crime.gov.in సైట్‌ ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చని ఆయన చెప్పారు. ఈ తరహా మోసగాళ్ల మాటలు నమ్మవద్దని సీపీ కోరారు.

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details